VIDEO: వ్యవసాయ పొలంలో పెద్దపులి కలకలం!
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో బుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. అనంతపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళలకు పులి కనిపించడంతో ఘటనాస్థలానికి పరిటిరిగి వచ్చిన గ్రామ ప్రజలు పులి పాదముద్రలను పరిశీలించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురైనారు. అధికారులు స్పందించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు