'బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
NRML: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, పీఎఫ్ ఉన్న అర్హత గల బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.