అనపర్తిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

E.G: అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి మండలంలోని రామవరం, పొలమూరు, చిన పొలమూరు గ్రామాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.