ఘటాలను మోసిన జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే

ASR: గిరిజన ప్రజల ఆరాధ్య దైవమైన హుకుంపేట మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతర మహోత్సవాలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హాజరయ్యారు. మోదకొండమ్మ అమ్మవారి ఘటాలను శతకంపట్టు వరకూ మోసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, జాతర మహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ పాల్గొన్నారు.