బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ ధర్నా
NLR: TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల విషయంలో రాజీనామా చేయాలంటూ తిరుపతిలో నిరసన తెలియజేసిన మహిళలపై దాడి చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయించారంటూ.. నెల్లూరులో వైసీపీ నిరసన తెలిపింది. జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద నాయకులు, మహిళలు, కార్యకర్తలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.