VIDEO: పర్యాటకులకు రక్షణ కరువు.....కాపాడేదెవరు..?

VIDEO: పర్యాటకులకు రక్షణ కరువు.....కాపాడేదెవరు..?

KNR: నిండుగా ఉన్న LMD వద్ద బోటింగ్ సందడిగా మారింది. అయితే, నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్‌కు వచ్చిన వారికి లైఫ్ జాకెట్లు ఇవ్వడం లేదని, కనీసం బోట్ నడిపే వ్యక్తి కూడా లైఫ్ జాకెట్ వేసుకోకపోవడం ప్రమాదకరమని చెబుతున్నారు. పాపికొండల్లో జరిగిన పడవ ప్రమాదం లాంటి ఘటన ఇక్కడ జరిగితే ఎవరు బాధ్యులని ప్రయాణికులు వాపోతున్నారు.