సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని షీ టీం ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం గరిడేపల్లిలోని గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. గరిడేపల్లి ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.