అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

RR: షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.5 కోట్ల నిధులతో అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలను, కొత్తూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్మించారు. ఈ నూతన భవనాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు.