నా రాజీనామాను ఆమోదించాలి: MLC
తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ MLC జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. YCP తరఫున MLCగా ఎన్నికైన వెంకటరమణ ఇటీవల జనసేనలో చేరారు. ఈ సందర్భంగా YCP ఇచ్చిన పదవి తనకు వద్దంటూ రాజీనామా చేశారు. అయితే దీనిని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆమోదించకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. దీంతో మండలికి రావాలని రాజు పిలుపునిచ్చారు. సోమవారం రాజును కలుస్తానని వెంకటరమణ తెలిపారు.