సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే

కృష్ణా: C.M రిలీఫ్ ఫండ్ చెక్కులను జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన బాధితులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అందజేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లుగా ప్రజలకు భరోసానిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి రాంబాబు, మన్నె నారాయణరావు, చావా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.