చిన్నారుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు: ఎమ్మెల్యే

NGKL: ఉప్పునుంతల మండలం లత్తీపూర్లో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని అన్నారు. వారికి మెరుగైన సదుపాయాలు కల్పించి, విద్యను పెంపొందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు.