వర్షంతో అధ్వానంగా మారిన ప్రధాన రోడ్లు

వర్షంతో అధ్వానంగా మారిన ప్రధాన రోడ్లు

గుంటూరులో గురువారం కురిసిన భారీ వర్షానికి కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్డు ప్రాంతం అధ్వానంగా మారింది. డ్రైన్‌లు పొంగిపొర్లి ప్రధాన రోడ్లపైకి చేరుకున్నాయి. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు మెరుగైన డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.