వందే భారత్ రైలు ప్రారంభానికి ఏర్పాట్లు

వందే భారత్ రైలు ప్రారంభానికి ఏర్పాట్లు

MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో ఈ నెల 15న వందే భారత్ రైలు స్టాప్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రైలును ప్రారంభించడానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ రైల్వే స్టేషన్‌లో సంబంధిత అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు.