70 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత
BDK: లక్ష్మీదేవిపల్లి (M) హేమచంద్రపురం సమీపంలోని చెట్ల పొదల మధ్య దాచి ఉంచిన సుమారు 70 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యాన్ని అధికారులు ఇవాళ పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధం చేసినట్లు సమాచారం. గుప్త సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ నరసింహారావు పై కేసు నమోదు చేశారు.