బార్ అండ్ రెస్టారెంట్లపై కేసులు నమోదు
గుంటూరు నగరంలో బార్‌లు సమయానికి ముందుగానే మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో గుంటూరు పశ్చిమ ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధనలు అతిక్రమించిన బార్ & రెస్టారెంట్లపై కేసులు నమోదు చేశారు. ఇకపై సమయపాలన పాటించకుండా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.