సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ADB: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దస్తురాబాద్ ఎంపీడీవో రమేష్ సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా మంగళవారం దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీరు ఎక్కడ నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు.