నేడే పాలిటెక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు
HNK: వరంగల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగానే నేడు నిర్వహించనున్నారు. ఇవాళ నిర్వహించనున్న ప్లాటినం జూబ్లీ వేడుకలకు 70 సంవత్సరాలుగా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది ఉమ్మడి జిల్లా విద్యార్థులు నేడు ఉన్నత స్థానంలో ఉన్నారు.