వేసవి వేడి.. తాటి ముంజెలకు భారీ డిమాండ్
MDCL: ఉప్పల్ ప్రాంతంలో వేసవి వేడి పెరుగుతున్న నేపథ్యంలో తాటి ముంజెలకు భారీ డిమాండ్ ఏర్పడింది. చల్లదనం, సహజమైన తీపి కలిగిన ముంజెలను తింటూ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం 10 ముంజెలు రూ.200కు విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రేతలు మంచి వ్యాపారం చేస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావించి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.