VIDEO: విషాదం.. వృద్ధుడు సజీవ దహనం
కృష్ణా: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పమిడిముక్కల మండలం మేడూరులో ఆరుబయట వరండాలో నిద్రిస్తున్న వీర్ల ఆంజనేయులు (65) అనే వృద్ధుడు మంగళవారం సజీవ దహనమయ్యాడు. స్థానికుల వివరాల మేరకు.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.