లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

పోలవరం జిల్లాలోని తెడ్లం గ్రామంలో సర్పంచ్ స్రవంతి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. వృద్ధాప్యంలో ఈ పింఛన్ ఒక భరోసానిస్తుందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్రమం తప్పకుండా, ఆలస్యం లేకుండా పింఛన్లు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేతిరెడ్డి సీతారామ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.