కాన్వాయ్ ట్రయల్ రన్‌లో వెంకటాపురం వద్ద స్వల్ప ప్రమాదం

కాన్వాయ్ ట్రయల్ రన్‌లో వెంకటాపురం వద్ద స్వల్ప ప్రమాదం

ములుగు జిల్లాలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రైలర్ సందర్భంగా ఇవాళ వెంకటాపురం సమీపంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ వేగంగా వెళ్తున్న సమయంలో ఒక పోలీసు వాహనం అదుపుతప్పి ముందున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎవరికి గాయాలు కాలేదని సమాచారం.