రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
VZM: రామభద్రపురం మండలం బూసాయవలస (ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్ల ఉండవచ్చని భావిస్తున్నారు. మృతిడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.