ఒక్క ఓటుతో సర్పంచ్‌గా విజయం
KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పొన్నాల సంపత్ సంచలన విజయం నమోదు చేశారు. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో సంపత్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ స్వల్ప తేడాతో గెలవడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. సంపత్‌కు గ్రామ ప్రజలు, అభిమానులు అభినందనలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.