ఒకే దేశం, ఒకే ఎన్నిక బీజేపీ వర్క్ షాప్

JGL: భారతీయజనతా పార్టీ కథలాపూర్ మండల కార్యాలయంలో గురువారం ఒకేదేశం, ఒకేఎన్నిక అనే అంశంపైన మండల అధ్యక్షులు మల్యాలమారుతి ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా నిర్వాహన వ్యయం తగ్గి, పరిపాలన సామర్థ్యం పెరుగుతుందని, మెరుగైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్త సత్తయ్య, ప్రతాప్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.