పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే
NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకలను గెలిపించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేశ్ కోరారు. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.