VIDEO: కొత్తగూడ మండలంలో భారీ వర్షాలు – వాగులు ఉద్ధృతం

MHBD: కొత్తగూడ మండలంలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంజేడు వాగు, గాదేవాగు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, చేపల వేటకు వెళ్లరాదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.