రైతు బజార్‌ను పరిశీలించిన జేసీ
VSP: అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్‌ను జేసీ గొబ్బిళ్ళ విద్యాదరి పరిశీలించారు. స్టాల్స్ నిర్వాహకులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బజార్‌లో కొనుగోలుదారులకు సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, రైతులకు సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జేసీతోపాటు మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.