వానోస్తే.. ఇంతేనా ?

శ్రీకాకుళం: జిల్లాకేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువును తలపించేలా ఉంది. పూర్తిగా వరద నీటితో నిండడంతో ప్రయాణికులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఎక్కడిక్కడ మురుగు కాలువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడికలు ఉండడంతో వర్షం నీరు వెళ్లే పరిస్థితి లేదు. ప్రతీసారి కాంప్లెక్స్‌లో ఈ సమస్య ఎదురవుతుందని, శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపుతారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.