తండ్రి దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన కలెక్టర్
MDK: మెదక్ జిల్లా కేంద్రంలోని మాటృశిశు సంక్షేమ కేంద్రంలో చికిత్స పొందుతున్న చిన్నారిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరామర్శించారు. ఇటీవల జరిగిన ఘటనలో తండ్రి దాడికి గురై తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రిలో చేరింది. కలెక్టర్ చిన్నారిని ప్రత్యక్షంగా కలసి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో కలిసి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.