ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం..!

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం..!

KMR: పిట్లంలోని చెరువు కట్ట శివాలయం సమీపంలో విద్యుత్ స్తంభం విరిగి ఒకవైపు నేలకు ఒరిగి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గం గుండా గ్రామస్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో పాటు రైతులు పశువులను పొలాలకు తీసుకెళ్తున్నారు. ఎప్పుడైనా స్తంభానికి తగిలితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.