విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ

VZM: ఎస్.కోట మండలం శ్రీసాయి పల్లెలో శ్రీసత్యసాయి దివ్యామృతం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ.. సత్యసాయి దివ్యామృతం సేవలు అభినందనీయం అన్నారు. ఇటువంటి మరిన్ని సేవలు నియోజకవర్గంలో అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు పాల్గొన్నారు.