పారిశుధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో బుధవారం పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగాయి. ఆయా వార్డ్‌లలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి పర్యటించి పారిశుధ్య పనులు పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ.. డ్రైనేజీల నిర్వహణ, చెత్త సేకరణ, రహదారుల స్వీపింగ్, తడి/పొడి చెత్త సేకరణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు.