జిల్లా జాగృతి అధ్యక్షుడిగా దామరగిద్ద వాసి

NRPT: తెలంగాణ రాష్ట్ర జాగృతి కమిటీల నియామకంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నారాయణపేట జిల్లాకు నూతన జాగృతి అధ్యక్షుడిగా శుక్రవారం గవినోళ్ల శ్రీనివాస్‌ను నియమించారు. ఈయనది దామరగిద్ద మండలం బాపనపల్లి గ్రామం. పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందువల్ల శ్రీనివాసును నియమించినట్లు కవిత పేర్కొన్నారు.