దూలపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
MDCL: కొంపల్లి మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝలిపించారు. దూలపల్లిలో అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్న కమర్షియల్ షెటర్ల నిర్మాణాన్ని JCB సహాయంతో కూల్చివేయించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టొద్దని, తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి హెచ్చరించారు.