శివాలపల్లెలో భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠ
KDP: శివాలపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున దర్శించుకుని పూజలు చేశారు. నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్య క్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.