విషాదం.. చెరువులో పడి బాలుడు మృతి
NRPT: దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సిములు (16) మేకలను మేపుతూ గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి మునిగిపోయాడు. స్థానికులు గమనించి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అధికారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.