శీతల గాలులు వీస్తున్నాయి.. జాగ్రత్త
KMR: జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి మరింత తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. రాత్రి 7 దాటిందంటే శీతల గాలులు వీస్తూ శరీర భాగాలు మంచులా తయారవుతున్నాయి. 75% మంది ప్రజలు పట్టణంలో రాత్రి 9 నుంచి రోడ్లపై కనబడట్లేదు. గ్రామాల్లోనైతే 7గంటల నుంచే ఇళ్లకే పరిమితమవుతున్నారు.