VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న స్కూటీ అదుపు తప్పి పడింది. దీంతో స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.