సుందరంగా ముస్తాబైన గోకఫసల్వాద్ శివాలయం
VKB: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోకఫసల్‌వాడ్ శివాలయం అత్యంత సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. శివనామస్మరణతో ఆలయం మారుమోగిపోతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వాహిస్తున్నారు.