VIDEO: మద్యం షాపుకు వ్యతిరేకంగా ఆందోళన
MDCL: కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు, కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. KPHB మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఈ షాపు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన చేపట్టారు. కోర్టు, పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని, మందుబాబుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. వెంటనే మద్యం షాపును తొలగించాలన్నారు.