'విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలి'

'విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలి'

SDPT: వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వసతి గృహాల సలహా సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.