VIDEO: 'జిల్లా విషయంలో ప్రభుత్వం నిర్ణయం లేదు'

VIDEO: 'జిల్లా విషయంలో ప్రభుత్వం నిర్ణయం లేదు'

జనగామ జిల్లా అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాను తీసివేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలపై అవగాహన లేకుండా కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, వాటిని నమ్మి ప్రజలు అపోహలకు గురికావద్దని ఆయన సూచించారు.