'యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలి'

WGL: పరకాల నియోజకవర్గ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అధికారులు తోడ్పడాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పరకాల పరిధిలోని కాకతీయ మెగా టెక్‌స్టైల్ పార్క్, పాల డైరీ, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై ఎమ్మెల్యే రేవూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.