VIDEO: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సీపీఐ వినూత్న నిరసన
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆదివారం మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సీపీఐ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.