'చివరి కౌన్సిల్ సమావేశంలోనైనా ప్రజలకు మేలు చేయాలి'
KRNL: కర్నూలు నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలోనైనా ప్రజలకు మేలు చేసే తీర్మానాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ గురువారం డిమాండ్ చేశారు. ప్రతీ సంవత్సరం 10% ఇంటి పన్ను పెంపు చేసే 198 జీవోను రద్దు చేయాలన్నారు. వ్యాపారులపై పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులను రద్దు చేయాలని మేయర్, మున్సిపల్ కమిషనరు వినతిపత్రం ఇచ్చారు.