ఎమ్మెల్యే వేగుళ్లకు కృతజ్ఞతలు తెలిపిన మేకా

కోనసీమ: రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన మేకా సూర్య భాస్కరరావు బుధవారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా తనపై నమ్మకంతో డైరెక్టర్ పదవి రావటానికి కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్లను దుశ్శాలువాలతో, పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.