నల్లగొండ డిపో నుంచి 5 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం
నల్గొండ డిపో నుంచి నాగార్జునసాగర్, మాచర్ల వరకు నూతనంగా 5 ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ కొత్త బస్సుల వల్ల పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చని కంట్రోలర్ అధికారి నాగిరెడ్డి తెలిపారు. మాచర్లకు వెళ్లే ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.