కమలాపురంలో ఉపాధ్యాయుల క్రీడా పోటీల సందడి

కమలాపురంలో ఉపాధ్యాయుల క్రీడా పోటీల సందడి

KDP: కమలాపురం పీవీఎస్ఆర్ఎం జూనియర్ కళాశాలలో శనివారం మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది. బోధనలో నిమగ్నమయ్యే ఉపాధ్యాయులు పుస్తకాలు పక్కనపెట్టి క్రీడా మైదానంలో ఉత్సాహంగా సందడి చేశారు. వివిధ క్రీడల్లో వారు తమ ప్రతిభను కనబరిచారు. ఈ క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని ఇచ్చాయని వారు పేర్కొన్నారు. పోటీలు హోరాహోరీగా సాగాయి.