'పర్యావరణ పరిరక్షణలో అక్కన్నపేట పోలీసుల ముందడుగు'

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్ స్టేషన్‌లో సీపీ అనురాధ ఆదేశాలతో స్థానిక ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “వన్ ఎంప్లాయీ – వన్ ప్లాంట్” లక్ష్యంగా ప్రతి పోలీస్ సిబ్బంది ఒక మొక్క నాటి, దాన్ని సంరక్షించుకోవాలని నిశ్చయించారు. పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారు.