'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
SRCL: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో కలెక్టర్ పరిశీలించారు. పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏఏ సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ పేషెంట్ వార్డులు పరిశీలించారు.